శ్రీదేవి ఫొటో తప్పు పెట్టారు..వర్మగారూ కాస్త చూసుకోండి

updated: February 28, 2018 10:39 IST
శ్రీదేవి  ఫొటో తప్పు పెట్టారు..వర్మగారూ కాస్త చూసుకోండి

సినీనటి శ్రీదేవి మృతి కు నివాళిగా ఆమె వీరాభిమాని ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ..గత నాలుగు రోజులుగా కంటిన్యూగా  ట్విట్టర్లో స్పందిస్తూనే ఉన్నారు.  ఇప్పటికే ఆమె మరణాన్ని తట్టుకోలేక ట్వీట్లపై ట్వీట్లు చేస్తూ వచ్చిన రామ్ గోపాల్ వర్మ.. శ్రీదేవికి సంబంధించి రీసెంట్ గా  ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో ఓ ఫొటోని పెట్టారు.   నందమూరి తారకరామారావు గారితో కలిసి శ్రీదేవి అని రాసారు. 

అయితే ఇక్కడ చెప్పుకోదగ్గ పాయింట్ ఏమిటీ అంటే...  ఆ ఫొటోలో ఉన్నది శ్రీదేవి కానే కాదు. అన్నగారి పెద్ద మనుమరాలు. ఆ విషయం వర్మ గమనించకుండా శ్రీదేవి చిన్ననాటి ఫొటో అనుకుని  ట్వీట్ చేసేసారు. ఆ ఫొటోలో ఉన్న అన్నగారి వయస్సుని బట్టి చూస్తే ఆ విషయం గమనించవచ్చు. ఎందుకంటే అన్నగారితో కలిసి శ్రీదేవి వేటగాడు సినిమాలో చేసారు..అంతకు ముందు బడిపంతులు చిత్రంలో చేసారు. బడిపంతులు నాటికి ఎన్టీఆర్ ..ఇంకా యువకుడే. వేటగాడు నాటికి శ్రీదేవి ..వయస్సులో ఉంది. ఈ రెండు విషయాలు టాలీ చేసుకుని చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్దమవుతుంది. 

 సోషలో మీడియాలో ఎవరన్నా షేర్ చేస్తే దాన్ని తీసి ట్వీట్  చేసినట్లున్నారు.  వర్మ  అంతటి వ్యక్తి సోషల్ మీడియా నుంచి ఏదైనా పోస్ట్ కానీ ట్వీట్ కానీ వచ్చిందంటే అందరి దృష్టీ దానిపైనే ఉంటుంది. అలాంటప్పుడు కాస్త దాన్ని ఒకటికి రెండు సార్లు చెక్ చేసి షేర్ చేస్తే బాగుంటుంది.  

comments